![]() |
![]() |
.webp)
రాజీవ్ మాటలు అన్నీ ఆలోచించుకుంటూ.. తనలో తానే ఊహించుకుంటుంది వసుధార. రిషీతో పెళ్ళి అయ్యినట్లు, జగతి మేడం పంపిన మంగళసూత్రం మెడలో వేసుకుంటుంది వసుధార. ఒకవైపు రాజీవ్, వసుధారల పెళ్ళి ఆపడానికి.. జగతి మేడం, మహేంద్ర, రిషి అందరూ కలిసి వసుధార ఇంటికి బయల్దేరతారు. మరోవైపు వసుధార వాళ్ళ ఇంట్లో ఉన్న రాజీవ్.. సునందకి కాల్ చేసి మాట్లాడుతుంటాడు. "వసుధారతో నా పెళ్ళి జరుగుతుంది. మీరు నాకు గిఫ్ట్ ఏం పంపించారా?" అని సునందతో అంటాడు రాజీవ్. "అలాగే పంపిస్తాను" అని సునంద అంటుంది.
ఆ తర్వాత వసుధార ఇంటికి వస్తాడు రిషి. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్నవాళ్ళతో మాట్లాడకుండా, రిషి డైరెక్ట్ గా వసుధార ఉన్న గదిలోకి వెళ్తాడు. "రా.. వసుధార మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం" అని వసుధార చెయ్యి పట్టుకొని అడుగుతాడు. దానికి వసుధార మౌనంగా కదలకుండా అక్కడే ఉండిపోతుంది. మరోవైపు రిషిని అడ్డుకుంటాడు వసుధార తండ్రి చక్రపాణి. అలాగే రిషీతో అక్కడే ఉన్న రాజీవ్ గొడవపడతాడు. రాజీవ్ మాట్లాడుతూ "రిషి సర్.. ఇక్కడ నాకు వసుధారకి పెళ్లి జరుగుతుంది. పిలవని పేరంటానికి వచ్చినవాళ్ళు తిరిగి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నువ్వు వసుధారని రమ్మని పిలిచినా కూడా తను రావట్లేదంటే.. నీతో రావడం తనకు ఇష్టం లేదనే కదా" అని అంటాడు. ఆ తర్వాత కాసేపు రాజీవ్, రిషి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇంతలో మహేంద్ర, జగతి మేడం అక్కడి వస్తారు. "వసు.. రా వెళదాం" అని రిషి అంటాడు. దానికి వసుధార రాజీవ్ అన్న మాటలనే గుర్తు చేసుకుంటుంది. "నా చెయ్యి వదలండి సర్" అని అంటుంది. అలా అనగానే రిషి షాక్ అవుతాడు. ఒక్కసారిగా చెయ్యి వదిలేస్తాడు.
"ఇక్కడి నుండి వెళ్ళండి సర్. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం" అని రిషీతో అంటుంది వసుధార. దానికి రిషి మాట్లాడుతూ "అంటే.. నాకేం సంబంధం లేదా?" అని అడుగుతాడు. వసుధార మాట్లాడుతూ "సర్.. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అని ప్రాధేయపడుతుంది. "నువ్వు నిజంగానే నన్ను వెళ్ళమంటున్నావా?" అని బాధతో అంటాడు రిషి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇకముందు ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |